: సోనియా కృతజ్ఞత సభను ప్రారంభించిన వీహెచ్
సోనియాగాంధీ కృతజ్ఞత సభను నల్గొండ జిల్లా నుండి కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వీహచ్ ఈ యాత్ర చేపట్టారు. హైదరాబాదు రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం కావాలని, రాయల తెలంగాణకు తాము వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకి ఇక్కడి ప్రజలు అండగా ఉంటారన్నారు. ఈ సభకు మంత్రి జానారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు భిక్షమయ్య గౌడ్, చిరుమర్తి లింగయ్య తదితరులు హాజరయ్యారు.