: రాష్ట్రాన్ని విభజించే అధికారం ఎవరికీ లేదు : ఆచార్య శామ్యుల్
భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ను విభజించే హక్కు ప్రభుత్వానికి లేదని సమైక్యాంధ్ర పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు ఆచార్య శామ్యుల్ అన్నారు. రాష్ట్ర సమైక్యతను కోరుతూ గుంటూరులో చేపట్టిన రిలే దిక్షా శిబిరంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని శామ్యుల్ తేల్చి చెప్పారు.