: పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
దేశంలో పలు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించారు. ఒడిశా గవర్నర్ గా కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్ సీ జమీర్.. నాగాలాండ్ గవర్నర్ గా సీబీఐ మాజీ డైరెక్టర్ అశ్వినీ కుమార్ నియమితులయ్యారు. ఇక బీహార్ గవర్నర్ గా డీవై పాటిల్ నియమితులయ్యారు. కాగా, నాగాలాండ్ మాజీ గవర్నర్ నిఖిల్ కుమార్ కేరళ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. త్రిపురకు దేవానంద్ కొన్వార్ గవర్నర్ గా వ్యవహరిస్తారు.