: జైల్లో 'ఫేస్ బుక్' ఎంజాయ్ చేస్తున్న హత్య కేసు నిందితుడు!
కేరళలోని కోజీకోడ్ జిల్లా జైలులో ఓ హత్య కేసు నిందితుడు ఫేస్ బుక్ తో ఎంజాయ్ చేస్తున్నాడు. ఫోటోలు అప్ డేట్ చేసి, కామెంట్లు పెడుతున్నాడు. గత ఏడాది మేలో కేరళకు చెందిన చంద్రశేఖరన్ అనే సీపీఐ (మార్క్సిస్ట్) నేత దారుణ హత్య కేసులో ఓ గ్యాంగ్ ను పోలీసులు అరెస్టు చేసి జైల్లో వేశారు. వారిలో రెండవ నిందితుడైన కిర్మాణీ మనోజ్, ఐదవ నిందితుడు మహ్మద్ షఫీ ఫేస్ బుక్ తో గడుపుతున్నారు.
నిన్న (ఆదివారం) మధ్యాహ్నం 1.12 గంటలకు చివరిగా ఓ ఫోటోను మనోజ్ తన ప్రొఫైల్ నుంచి షేర్ చేశాడు. జైలు లోపల ఉన్న ప్రాంతం, పరిసర ప్రాంతాలలో వారెంత బాగా గడుపుతున్నారో ఆ ఫోటోలో కనిపిస్తోంది. అంతేకాదు, నేత మృతికి సీపీఐ(ఎమ్)కి సంఘీభావం ప్రకటిస్తూ కామెంట్ కూడా పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న జైలు అధికారులు తక్షణమే విచారణ చేపట్టారు. నిందితులకు ఫోన్ ఎలా లభించింది, ఎవరు అందజేశారన్న దానిపై క్షుణ్ణమైన తనిఖీలు చేస్తున్నట్లు జైలు డీజీపీ అలెగ్జాండర్ జాకోబ్ తెలిపారు.