: డీఎస్పీ సుప్రజపై క్రమశిక్షణా చర్యలు పరిశీలిస్తున్నాం: డీజీపీ ప్రసాదరావు


గుంతకల్ డీఎస్పీ సుప్రజపై క్రమశిక్షణా చర్యలు పరిశీలిస్తున్నామని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. సుప్రజను ప్రస్తుతం గ్రేహౌండ్స్కు బదిలీ చేశామని, గుంతకల్ ఘటనపై ఎంక్వైరీ చేసి నివేదిక అందించాలని రాయలసీమ ఐజీని ఆదేశించామని డీజీపీ తెలిపారు. ఓ హత్య కేసుకు సంబంధించి నిందితులకు నిన్న నడిరోడ్డుపైనే కౌన్సిలింగ్ ఇచ్చిన సుప్రజ దూకుడుగా వ్యవహరించారు. డీఎస్పీ సుప్రజ నిందితులను పట్టుకుని ఊర్లో ఊరేగించడంతోపాటు బహిరంగంగా రోడ్డుపైనే లాఠీలతో కొట్టిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News