: సూపర్ క్రిటికల్ థర్మల్ యూనిట్ ను ప్రారంభించిన భెల్
బీహార్ లోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ పవర్ ప్లాంటులో తొలి 660 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ యూనిట్ ఉత్పత్తిని భెల్ కంపెనీ (భీహెచ్ఇఎల్) ప్రారంభించింది. ప్రస్తుతం కంపెనీ 660, 700, 800 ఎం.డబ్ల్యు రేటింగ్స్ ఉన్న 24 టర్భైన్లు, 27 స్టీమ్ జనరేటర్ల సరఫరా, ఇన్ స్టలేషన్ ఆర్డర్లను నిర్వహిస్తోంది. వెయ్యి మెగావాట్ రేటింగ్ ఉన్న థర్మల్ సెట్ల తయారీ సామర్థ్యం భెల్ కంపెనీకి ఉంది.