: స్టాండింగ్ కమిటీలకు చైర్మన్ల నియామకం ఈనెల 15 తర్వాత
మరికొద్ది రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో స్టాండింగ్ కమిటీల అంశంపై స్సీకర్ నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఈనెల 15 తర్వాత స్టాండింగ్ కమిటీలకు చైర్మన్లను నియమిస్తామని తెలిపారు. ఆ తర్వాత నూతన చైర్మన్లు, ఇతర శాసనసభ్యులకు ఈ నెల 25న అవగాహన సదస్సు నిర్వహిస్తామని స్పీకర్ అన్నారు. కాగా, స్టాండింగ్ కమిటీ చైర్మన్లుగా సీనియర్లకే ప్రాధాన్యం ఉంటుందని ఆయన చెప్పారు.