: జగన్ చెప్పింది చేసే వైఎస్ రాష్ట్రాన్ని నాశనం చేశారు: సోమిరెడ్డి
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో కొడుకు జగన్ ఏది చెబితే అదిచేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. జగన్ చెప్పేదానికి ఎదురు మాట్లాడే ధైర్యం వైఎస్ కు లేదన్నారు. చంద్రబాబు ప్రతి ఏడాది తన ఆస్తులను ప్రకటిస్తుంటే.. జగన్ ఆస్తులను మాత్రం ప్రతి ఏడాది సీబీఐ ప్రకటిస్తోందని ఎద్దేవా చేశారు. అంబానీ, టాటాలు పోయి.. అధిక పన్ను కట్టేవారి జాబితాలోకి జగన్ చేరారన్నారు. వైఎస్ లాగా ఎన్టీఆర్ తన వారసులకు గనులు లాంటివి ఇవ్వలేదన్న సోమిరెడ్డి.. జగన్, కేవీపీ తీసుకున్న కమీషన్ల విషయంలో టీడీపీ చర్చకు సిద్ధమని చెప్పారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు అంచనాలను ఐదేళ్లలో రూ.428 కోట్లకు అదనంగా పెంచేశారన్నారు.