: సొంత నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సోనియాగాంధీ


ఉత్తరప్రదేశ్ లోని సొంత పార్లమెంటరీ నియోజకవర్గం రాయ్ బరేలీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామీణ సడక్ యోజన కింద నిర్మించనున్న 50 రహదారులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలను కలుపుతూ ఈ రోడ్లను నిర్మిస్తున్నారు. సరాయ్ ముగ్లాలో నీటి శుద్ధి ప్లాంటును కూడా సోనియా ప్రారంభించారు. రాయ్ బరేలీ-మహారాజ్ గంజ్-అక్బర్ గంజ్ ల మధ్య నిర్మించనున్న రైలు మార్గానికి కూడా పునాది రాయి వేస్తున్నారు. వీటితో పాటు ఆకాశవాణి కార్యాలయంలో ఎఫ్ఎం రేడియో స్టేషన్ ను కూడా సోనియా ప్రారంభిస్తున్నారు.

  • Loading...

More Telugu News