: కృష్ణా జలాల వివాదంపై కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలి: చంద్రబాబు
కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్ కుమార్ తీర్పును రద్దు చేసి కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని రాష్ట్రపతిని కోరినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అంతేగాక ట్రైబ్యునల్ తీర్పును గెజిట్ లో ప్రకటించకుండా చూడాలని రాష్ట్రపతిని కోరినట్లు తెలిపారు. ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని టీడీపీ నేతల బృందం ఈ రోజు కలిసింది. అనంతరం మీడియాతో బాబు మాట్లాడుతూ.. మిగులు జలాలు అవసరం లేదని వైఎస్ ఇచ్చిన అఫిడవిట్ తో రాష్ట్రం నష్టపోయిందని బాబు పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర విభజన విషయంలో ఇరు ప్రాంతాల జేఏసీ నేతలతో మాట్లాడి సమన్యాయం చేయాలని బాబు ప్రణబ్ ముఖర్జీని కోరారు.