: అలహాబాద్ యూనివర్శటీలో విద్యార్ధుల మధ్య ఘర్షణ


ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ యూనివర్శటీలో రెండు వర్గాల విద్యార్ధుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ గొడవలో విద్యార్ధులు ఒకరిపై ఒకరు రాళ్లు, నాటు బాంబులు విసురుకొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది విద్యార్ధులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. విద్యార్ధుల గుంపును చెదరగొట్టేందుకు బాటూన్లు ఉపయోగించారు. ఈ సమయంలో 20 మంది విద్యార్ధులకు, ఆరుగురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. 

ఈ అల్లర్లకు అసలు కారణం, యూపీ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఉచిత ల్యాప్ టాప్ పంపిణీ పథకందీని ద్వారా ల్యాప్ టాప్ లు పొందాలంటే ముందుగా అర్హత కలిగిన విద్యార్ధులు పేర్లు నమోదు చేసుకోవాలి. ఈ సమయంలో యూనివర్శటీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు, మరి కొంతమంది విద్యార్ధుల మధ్య ఘర్షణ తలెత్తింది. చిన్న సమస్య కారణంగా గొడవ రావడంతో సర్దిచెప్పేందుకు వర్శిటి అధికారులు, ఉపాధ్యాయులు ప్రయత్నించినా వినలేదు. దాంతో, పోలీసులకు సమాచారం అందించారు. అయితే విద్యార్ధులెవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News