: ప్రమాదవశాత్తు రైలు, ప్లాట్‌ఫామ్‌ మధ్య నలిగి మహిళ మృతి


కాన్పూర్ లో రైలు, ప్లాట్ ఫామ్ మధ్య నలిగి ఓ మహిళ చనిపోయింది. ఈమె కదులుతున్న రైలు ఎక్కేందుకు యత్నించి పట్టు తప్పి పడిపోయింది. తీవ్రంగా గాయపడిన మహిళను బయటకు తీసేందుకు రైల్వే సిబ్బంది 45 నిమిషాల పాటు శ్రమించినా ఫలితం లేకపోయింది. కాగా రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన కుమార్తె చనిపోయిందని మృతురాలి తల్లి ఆరోపించింది. ప్రయాణికురాలు అప్రమత్తంగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నార్త్ సెంట్రల్ రైల్వే సీపీఆర్ వో నవీన్ బారు చెప్పారు. బాధితురాలి కుటుంబానికి ఎలాంటి పరిహారం చెల్లించలేమని నవీన్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News