: టాప్ టెన్ లో ధావన్


టీం ఇండియా యువ సంచలనం, ఓపెనర్ శిఖర్ ధావన్ తొలిసారిగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ లో ప్రవేశించాడు. ఇటీవల ముగిసిన వెస్టిండీస్ సిరీస్ లో చెలరేగి ఆడిన ధావన్, తొమ్మిదో ర్యాంకుకు ఎగబాకాడు. తొమ్మిదో స్థానంలో ఉన్న పాక్ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ పదో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి మొదటి స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా ఆటగాడు డీవిలియర్స్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత సారథి ధోనీ ఆరో స్థానంలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News