: మోడీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఒమర్ అబ్దుల్లా
దేశంలో ఎక్కడా లేని విధంగా జమ్మూ కాశ్మీర్లో మహిళలు వివక్షకు గురవుతున్నారంటూ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ నిన్న జమ్మూ సభలో చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తిప్పికొట్టారు. మోడీకి ఎవరో తెలిసీ తెలియని సమాచారం ఇచ్చారని లేదా అబద్దం చెబుతున్నారని ఒమర్ ట్విట్టర్లో స్పందించారు. మహిళల వివక్షకు ఒమర్ సోదరిని మోడీ ఉదాహరణగా పేర్కొన్నారు. ఒమర్ ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళను పెళ్లాడితే లేదు గానీ, ఆయన సోదరి సారా మాత్రం కేంద్ర మంత్రి సచిన్ పైలట్ ను పెళ్లాడినందుకు జమ్మూకాశ్మీర్ నివాసురాలిగా హక్కులను కోల్పోయారని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ పర్యాటకులను కూడా ఆదరించడం లేదన్న మోడీ వ్యాఖ్యలను సైతం ఒమర్ అబ్దుల్లా తప్పుబట్టారు.