: కేరళలో బెంగళూరు సాఫ్ట్ వేర్ ఇంజనీరుపై అత్యాచారం
మహిళలపై నిత్యం లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కామంతో కళ్లు మూసుకుపోవడంతో బరితెగించి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. చూడబోతుంటే ఇదే వైరస్ లా మారినట్లు కనిపిస్తోంది. చట్టాలు వారి ఆగడాలకు చెక్ పెట్టలేకున్నాయి. 40 ఏళ్ల బెంగళూరు సాఫ్ట్ వేర్ ఇంజనీరు కేరళ అందాలను చూడ్డానికి వెళ్లి హోటల్లో ఇద్దరి చేతిలో అత్యాచారానికి గురైంది. సహచర ఉద్యోగులతో కలిసి ఆమె కేరళకు వెళ్లారు. తిరువనంతపురం సమీపంలోని బ్యాక్ వాటర్ రిసార్టులో బస చేయగా.. ఒక రోజు అర్ధ రాత్రి ఇద్దరు వచ్చి తలుపు తట్టారు. తీసిన వెంటనే వారు లోపలకు బలవంతంగా ప్రవేశించారు. ఒకరు పట్టుకోగా.. మరొకరు లైంగిక దాడి చేశారు. కేరళ నుంచి బెంగళూరుకు తిరిగి వెళుతూ జరిగిన ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు హోటల్ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.