: అంగరంగ వైభవంగా పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి అమ్మవారికి సింహ వాహన సేవ జరిగింది. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు... సింహ వాహనంపై ఊరేగుతున్న అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఇవాళ ఉదయం స్వర్ణాలంకార భూషితురాలైన పద్మావతి అమ్మవారు కల్ప వృక్ష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తున్నారు.