: ఢిల్లీలో ఈ రోజుతో ముగియనున్న ఎన్నికల ప్రచారం
హోరాహోరీగా సాగుతున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికల ప్రచార పర్వం ఈ రోజుతో ముగియనుంది. అధికారాన్ని కైవసం చేసుకోవడానికి పార్టీలన్నీ తమ శక్తియుక్తుల్ని పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల నాలుగో తేదీన పోలింగ్ జరగనుంది. గెలుపుపై కాంగ్రెస్, బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ హ్యాట్రిక్ పై కన్నేయగా, అన్ని రకాలుగా ప్రజలకు దూరమైన కాంగ్రెస్ కు పాతరేసి ఓటర్లు తమకు పట్టం కడతారని బీజేపీ భావిస్తోంది. కొత్తగా పుట్టుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతోంది.