: సోమాలియా పైరేట్ల చెరనుంచి భారత నావికులకు విముక్తి


సోమాలియా సముద్రపు దొంగల చెరలో ఉన్న 28 మంది భారత నావికులకు విముక్తి కల్పించినట్టు భారత షిప్పింగ్ మంత్రి జీకే వాసన్ వెల్లడించారు. మంత్రి ఈరోజు చెన్నయ్ లో మాట్లాడుతూ, విడుదలైన నావికులు ఈ వారంలో భారత్ చేరుకోనున్నట్టు తెలిపారు.

గతేడాది సోమాలియా సముద్రపు దొంగలు అంతర్జాతీయ సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న చమురు నౌకలు మర్చంట్ గ్రేస్, స్మిర్నిల నుంచి భారత నావికులను బందీలుగా పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి వాసన్ మాట్లాడుతూ, పైరేట్ల వద్ద ఇంకా 9 మంది భారతీయులు బందీలుగా ఉన్నారని త్వరలోనే వారికి కూడా విముక్తి కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. 

  • Loading...

More Telugu News