: స్మగ్లర్ల దాడిలో ఎస్సై, కానిస్టేబుల్ కు గాయాలు
చిత్తూరు జిల్లాలో కలప స్మగ్లర్ల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. అడ్డొచ్చిన అటవీ, పోలీసు అధికారులపై దాడులు, హత్యలకు పాల్పడడానికి సైతం వారు వెనకాడడం లేదు. తాజాగా ఈ ఉదయం తిరుపతి సమీపంలో రామచంద్రాపురం మండలం అనుపల్లి వద్ద ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్లను పోలీసులు అడ్డుకోబోయారు. స్మగ్లర్లు పోలీసులపై దాడి చేసి.. మినీ లారీ, కారును వదిలి పారిపోయారు. దాడిలో టాస్క్ ఫోర్స్ ఎస్సై అశోక్ కుమార్, కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. 60 లక్షల విలువైన ఎర్ర చందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.