: ఎక్కడెక్కడ ఉద్యోగాలున్నాయంటే...


ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? అనే విషయం చాలామందికి తెలియదు. దీంతో అర్హత ఉన్నా కూడా సమాచారం తెలియకపోవడంతో చాలామంది ఉద్యోగావకాశాలను కోల్పోతుంటారు. అలాకాకుండా ఫలానా దగ్గర మీకు సరిపడే ఉద్యోగాలు ఉన్నాయి అనే విషయాన్ని మనకు ఎవరైనా చెబితే చక్కగా అప్లై చేసుకుని అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఇలాంటి వారికోసమే ఒక కొత్త సోషల్‌ హైరింగ్‌ అప్లికేషన్‌ అందుబాటులోకి వచ్చింది. ఇది ఎవరికీ తెలియకుండా వృథాగా పోతున్న ఉద్యోగాల గురించి అందరికీ తెలియజేస్తుందట.

ఉద్యోగ ప్రకటనలు చేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో చాలా కంపెనీలు పేపర్‌ ప్రకటనకు దూరంగా ఉంటాయి. ఇలాంటి కంపెనీలు పలు నియామక ఏజన్సీలతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఒక్కో ఏజన్సీకి ఒక్కో విభాగానికి సంబంధించిన నియామకాలను అప్పగిస్తాయి. దీంతో ఉన్నత విద్య పూర్తి చేసిన అభ్యర్ధులు తమ అర్హతకు సరిపడే ఉద్యోగాన్ని వెతుక్కోవడంకోసం అన్ని నియామక ఏజన్సీలను కలుసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టసాధ్యమైనపని. కొన్ని కంపెనీలు తమ అధికారిక కంపెనీ వెబ్‌సైట్లో ఉద్యోగ ప్రకటనల కొరకు ప్రత్యేకంగా ఒక పేజీని కేటాయిస్తున్నాయి. కానీ ఇలాంటి అవకాశాలు అందరికీ తెలియడం కష్టం. ఇలాంటి ఉద్యోగావకాశాలను అందరికీ తెలిసేలా చేయడానికి ప్రయత్నించేదే విజిల్‌టాక్‌ సోషల్‌ హైరింగ్‌ అప్లికేషన్‌. దీనివల్ల పలువురు నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News