: మన వాళ్ళు బాగా తినడంలేదట!


'ఒకవైపు ఊబకాయం వచ్చేస్తుంటే... ఏం తింటాం?' అని కొందరంటుంటే మరోవైపు, 'ఏం తింటాం... కూరగాయల ధరలు ఇలా మండిపోతుంటే'అని మరికొందరు అంటారు. ఇలా ఏదైతేనేం, రకరకాల కారణాలతో, మన జనం సరైన పోషకాహారం తినడం లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండడంకోసం సరైన పోషకాహారం తీసుకోవాల్సి ఉంది. కానీ పెరుగుతున్న ధరలతో ఖర్చులను తగ్గించుకోవడానికి మనం కొనే ఆహారపదార్ధాల్లో పండ్లు, కూరగాయలు, గుడ్లు, పాలు, మాంసాహారం వంటి వాటిని తగిస్తున్నట్టు ఈ సర్వేలో తేలింది.

అసోచామ్‌ రెండు వేలమంది గృహిణులు, వెయ్యిమంది ఉద్యోగులతో అక్టోబరు, నవంబరు నెలల్లో ఒక ప్రత్యేక సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో దేశంలో పోషకాహార వినియోగం గతంతో పోల్చుకుంటే 40 శాతం తగ్గినట్టు తేలింది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతోబాటు విద్య, ఆరోగ్యం, రవాణాకు అయ్యే ఖర్చులు కూడా పెరగడం వల్ల, సంపాదనలో పెరుగుదల స్థాయిని ధరల స్థాయి మించిపోతుండడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు జీవనం చాలా భారంగా తయారవుతోందని అసోచామ్‌ ప్రధాన కార్యదర్శి డి.ఎస్‌.రావత్‌ తెలిపారు. గతంలో అందరికీ అందుబాటులో ఉండే ఉల్లి, బంగాళాదుంప, టమోటా, బెండకాయ వంటివి ఇప్పుడు పేదల సంగతి పక్కనపెడితే మధ్య తరగతి వారికి కూడా కొనుగోలు చేయడం కష్టంగా ఉందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో భారతీయులు సరైన పోషకాహారాన్ని తీసుకోలేకపోతున్నారని రావత్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News