: చంద్రుడిపై చైనా తొలి అడుగు


ఇప్పటి వరకూ చంద్రుడిపై అమెరికా, సోవియట్‌ల ఆధిపత్యంలోకి మరో దేశం వచ్చింది. చంద్రుడిపై ఇప్పటి వరకూ అమెరికా, సోవియట్‌ దేశాలు మాత్రమే ల్యాండర్‌లను దించాయి. తర్వాత ఏ దేశమూ చంద్రుడిపై దిగింది లేదు. ఇప్పుడు చైనా తమ తొలి ల్యాండర్‌ను చంద్రుడిపై దించి, ప్రపంచ చరిత్రలో ఆ ఘనతను పొందుతోంది.

చైనా దేశ పరిశోధకులు చాంగె-3 అనే వ్యోమనౌకను లాంగ్‌ మార్చ్‌-3బి రాకెట్‌ ద్వారా గ్జిచాంగ్‌ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుండి రోదశిలోకి పంపించారు. ఇది ఆదివారం నాడు విజయవంతంగా ప్రయోగించబడింది. తాము పంపిన వ్యోమనౌక నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించిందని ఆ దేశ అంతరిక్ష సంస్థ అధికారులు ప్రకటించారు. ఈ ల్యాండర్‌ ఈనెల మధ్యలో చంద్రుడిపై దిగుతుందని అధికారులు తెలిపారు.

చైనా దేశానికి చెందిన చాంగె-3 ల్యాండర్‌లో యుతు అనే రోవర్‌ కూడా ఉంది. ఇది చంద్రుడిపై సంచరిస్తూ చంద్రుడి ఉపరితలంపై ఉన్న పదార్థాలు, సహజవనరులపై పరిశోధన సాగిస్తుంది. 1976 తర్వాత అమెరికా, సోవియట్‌ దేశాల తర్వాత చంద్రుడిపైకి ఏ దేశమూ ల్యాండర్లను పంపింది లేదు. 37 సంవత్సరాల తర్వాత చంద్రుడిపైకి ల్యాండర్‌ను పంపిన మూడవ దేశం ఘనతను చైనా సొంతం చేసుకోనుంది.

  • Loading...

More Telugu News