: అప్పుల ఊబిలో తెహల్కా
దేశవ్యాప్తంగా సంచలన కథనాలను అందించిన తెహల్కా పత్రిక ఇప్పుడు కేసులు, అప్పులతో వార్తల్లో ఎక్కడం విచారంతో పాటు విస్మయాన్ని కలిగిస్తోంది. లైంగిక వేధింపుల కేసులో తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా తెహల్కా అప్పులతో తిప్పలు పడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అనంత్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ఆధ్వర్యంలో తెహల్కా పబ్లికేషన్ గ్రూప్ నడుస్తోంది. ఆస్తుల విలువ కంటే ఆస్తి-అప్పుల చిట్టా ఎక్కువగా ఉన్నట్టు తెహల్కా హోల్డింగ్ కంపెనీ ఆడిటింగ్ నివేదికలో వెల్లడయింది. ఈ కంపెనీకి సుమారు 13 కోట్ల రూపాయల మేర అప్పులు ఉన్నట్లు తెలుస్తోంది.