: మూడో పార్టీకి అవకాశమే లేదు: అద్వానీ


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ కాకుండా మూడో పార్టీకి అవకాశమే లేదని ఆప్ నుద్దేశించి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ ఓట్లన్నీ ఒకే పార్టీ కొల్లగొడుతుందని, మూడో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ ఓటర్లు తెలివైన వారన్న అద్వానీ బీజేపీనే గెలిపిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News