: మధ్యప్రదేశ్ లో రేపు 6 పోలింగ్ స్టేషన్లలో రీ పోలింగ్


మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆరు పోలింగ్ స్టేషన్లలో రేపు రీ పోలింగ్ జరుపనున్నట్లు ఎంపీ ఎన్నికల అధికారులు ప్రకటించారు. మధ్యప్రదేశ్ లో 230 విధానసభ స్థానాలకు నవంబర్ 25న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఐదు నియోజకవర్గాల్లోని ఆరు పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్నికల కమిషన్ రీ పోలింగ్ జరపాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు. ఎన్నికల ఫలితాలను ఈ నెల 8వ తేదీన ప్రకటిస్తారు.

  • Loading...

More Telugu News