: వైఎస్ చేసిన అన్యాయానికి జగన్ క్షమాపణలు చెప్పాలి: దేవినేని ఉమ
మిగులు జలాలపై ప్రశ్నించమని, కర్ణాటక ప్రాజెక్టులకు అడ్డు చెప్పమని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు వైఎస్ రాజశేఖర రెడ్డి లేఖ ఇవ్వడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయని టీడీపీ నేత దేవినేని ఉమ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ వైఎస్స్ చేసిన పాపానికి ఆయన కుమారుడు జగన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పుతో గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో జొన్న కూడు తినే రోజులు పునరావృతమవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తలెత్తే దుర్భర పరిస్థితుల మీద ప్రకాశం బ్యారేజీ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టే ధర్నాకు మద్దతివ్వాలని ఆయన పిలుపునిచ్చారు.