: సాకర్ అల్లర్ల కారకులకు మరణశిక్షను నిర్ధారించిన ఈజిప్ట్ కోర్టు
గత ఏడాది ఈజిప్ట్ సాకర్ మ్యాచ్ సందర్భంగా జరిగిన అల్లర్లలో 70 మందికి పైగా చనిపోవడానికి కారకులైన 21 మందికి న్యాయస్థానం గతంలో విధించిన మరణశిక్షను ఈజిప్టు అత్యున్నత న్యాయస్థానం నిర్ధారించింది. ఈ మేరకు కోర్టు శనివారం తీర్పు వెల్లడించింది. కాగా, ఈ వ్యవహారంలో సిటీ మాజీ రక్షణాధికారి, మేజర్ జనరల్ ఎస్సమ్ సమక్ కు 15 సంవత్సరాల జైలు శిక్షను విధించింది.
21 మంది నిందితులకి న్యాయస్థానం జనవరి 28న మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే తీర్పును వ్యతిరేకించిన పలువురు నగరంలో నిరసనలు వ్యక్తం చేస్తూ విధ్వంసం సృష్టించారు. ఈ సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 40 మంది మరణించారు.
దీంతో మళ్లీ కోర్టు నేడు తీర్పును నిర్ధారించింది. 2012 ఫిబ్రవరిలో అల్ మస్రీ, కైరో అల్ అహ్లీ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా ఎవరు గెలుస్తారనే దానిపై అభిమానుల మధ్య ఉత్కంఠ ఏర్పడింది. చివరికి రెండు జట్ల అభిమానుల మధ్య ఘర్షణతో కోర్టులో తీవ్ర తొక్కిసలాట జరిగి అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.
21 మంది నిందితులకి న్యాయస్థానం జనవరి 28న మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే తీర్పును వ్యతిరేకించిన పలువురు