: ప్రజల సమక్షంలో హత్యకేసు నిందితుల విచారణ


అనంతపురం జిల్లా గుంతకల్ లో జరిగిన ఓ హత్యకేసులో నిందితులకు పోలీసులు తమదైన రీతిలో బహిరంగ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఘటనా స్థలంలోనే నిందితులకు బుద్ధి చెప్పారు. నాలుగు రోజుల క్రితం గుంతకల్ లో మల్లయ్య అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అతని అల్లుడు శేఖరే ఈ హత్యకు పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురిని అరెస్టు చేశారు.

గుంతకల్ డీఎస్పీ సుప్రజ ఆధ్వర్యంలో పోలీసులు నిందితుల్ని బస్టాండ్ సమీపంలో హత్య జరిగిన ప్రాంతానికి తీసుకొచ్చారు. ఇంటరాగేషన్ సెల్ లో చేయాల్సిన విచారణను రోడ్డుపై ప్రజల సమక్షంలో నిర్వహించారు. దీనిపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నా, హక్కుల కార్యకర్తలు మాత్రం నిరసన తెలుపుతున్నారు.

  • Loading...

More Telugu News