: ఏడేళ్ల మన బుడతడు.. 'కిలిమంజారో' పనిబట్టాడు..!


పర్వాతారోహణ అంటే మహామహులే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఎంతో కష్టసాధ్యమైన క్రతువు అది. పైకి వెళ్లే కొద్దీ శారీరక సామర్థ్యం సన్నగిల్లుతూ ఉంటుంది. వాతావరణమూ అనుకూలించదు. కొంత ఎత్తుకు చేరిన తర్వాత గాలి పీడన స్థాయిలో గణనీయ మార్పులు చోటు చేసుకుంటాయి, పర్యవసానం, ఆక్సిజన్ లభ్యత తగ్గిపోతుంది. ఊపిరందక కొందరు పర్వాతారోహకులు మరణించిన సందర్భాలూ ఉన్నాయి.

అయితే, ఇవేవీ 7 ఏళ్ల ఆర్యన్ బాలాజీ అనే  భారత చిన్నారిని చరిత్ర సృష్టించకుండా నిలువరించలేకపోయాయి. ఈ చిన్నారి ఆర్యన్ ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వతం కిలిమంజారో (19343 అడుగులు) పనిబట్టి అందర్నీవిస్మయంలో ముంచెత్తాడు. కిలిమంజారో అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సాధించాడు.

ఇటీవల ఆ సమున్నత పర్వతరాజంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి నిజంగా అద్భుతం చేశాడీ బుడతడు. ఆర్యన్ తండ్రి భారత నావికాదళంలో కమాండర్. ఈయనా సాహసే. గతంలో ఎవరెస్ట్ ఎక్కడంతో పాటు ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి యాత్ర సాగించాడు. 

  • Loading...

More Telugu News