: చెరువులోకి దూసుకెళ్లిన బస్సు.. తప్పిన ముప్పు
ఆర్టీసీ బస్సు ఒకటి అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో ఈ ఉదయం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. వీరిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బస్సులో మొత్తం 53 మంది ప్రయాణికులు ఉన్నారు.