: భూకంపాల గురించి హెచ్చరించేందుకు ఓ యాప్‌


ఇప్పుడు ఆధునిక జీవనశైలి అనగానే అది యావత్తూ స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ల ప్రపంచంలో మునిగిపోతోంది. యాప్‌లు అనేవి తెలియకుండా ఆధునిక సమాజంలో బతకడం ఎలాగో కూడా సందేహాస్పదం అయ్యే రోజులు వస్తున్నాయి. యాప్‌లు కేవలం మన జీవన శైలిని సులభతరం చేయడం మాత్రమే కాదు.. మన జీవితాల్లో భద్రతను కూడా పెంచేస్తున్నాయని యాప్‌లలో నవతరం ఆవిష్కరణలను చూస్తే అర్థమవుతుంది. తాజాగా భూకంపాల గురించి ముందుగానే హెచ్చరించే ఒక యాప్‌ను రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది కల్లా ఈయాప్‌ అందరికీ వినియోగంలోకి వస్తుందని భావిస్తున్నారు.

ప్రకృతి విపత్తుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఆధునిక సాంకేతికతను ఎలా వినియోగించుకోవాలనే విషయమై రియో డి జెనీరోలో జరిగిన ఒక ప్రపంచ సైన్స్‌ ఫోరంలో శాస్త్రవేత్తలు ఈ యాప్‌ గురించి పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు, పై సదస్సులో ఈ యాప్‌కు సంబంధించిన ప్రాజెక్ట్‌ను ప్రదర్శించారు.

కాలిఫోర్నియాలోని యూసీ బర్కిలీ సీస్మలాజికల్‌ లేబొరేటరీ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ రిచర్డ్‌ అలెన్‌ ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ భూకంపం తాకిడి మనకు తెలియడానికి కొన్ని సెకన్లనుంచి ఒక నిమిషం ముందుగానే అలర్ట్‌ చేస్తుందని వారు చెబుతున్నారు. అయితే ఆ ఫోనును వాడుతున్న వ్యక్తి.. భూకంప కేంద్రానికి ఎంత దూరంలో ఉన్నారు అనే దాన్ని బట్టి కూడా ఎంత త్వరగా యాప్‌ హెచ్చరిస్తుందనేది ఆధారపడి ఉంటుందిట.

  • Loading...

More Telugu News