: ఏటీఎం కార్డుతో కొనుగోళ్లకు పిన్ నెంబరు తప్పనిసరి: రిజర్వ్ బ్యాంక్
ఏటీఎం కార్డుతో షాపింగ్ చేస్తున్నారా...? అయితే ఈ విషయాన్ని గమనించండి. ఇక నుంచి డెబిట్ కార్డుతో కొనుగోళ్లు జరిపినప్పుడు తప్పనిసరిగా పిన్ నెంబరు ఉపయోగించాలని రిజర్వ్ బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుల డెబిట్ కార్డుతో ఏవైనా వస్తువులు కొనుగోలు చేయాలంటే స్వైప్ చేసిన యంత్రంపై వినియోగదారుడు కార్డు పిన్ నెంబరును పంచ్ చేయాల్సి ఉంటుంది. డిసెంబరు ఒకటవ తేదీ, ఆదివారం నుంచి ఇది అమలులోకి వస్తుంది.