: కిరణ్, చంద్రబాబులవి నిజాయతీ లేని రాజకీయాలు: జగన్


సీఎం కిరణ్, తెదేపా అధినేత చంద్రబాబులు నిజాయతీతో కూడిన రాజకీయాలకు దూరంగా ఉన్నారని వైకాపా అధ్యక్షుడు జగన్ విమర్శించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన సమైక్య శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యానాలు చేశారు. ఇప్పటికైనా వారిద్దరిలో మార్పు రావాలని కోరుతున్నానని చెప్పారు. రాష్ట్రం విడిపోతే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సముద్రపు నీరే గతని తెలిపారు. విభజనతో రాష్ట్రం పూర్తిగా నష్టపోతుందని తెలిపారు. ఉద్యోగాల కోసం క్యాంపస్ రిక్రూట్ మెంట్లు సగానికి సగం పడిపోయాయని జగన్ తెలిపారు.

  • Loading...

More Telugu News