: రోడ్డు ప్రమాదంలో 15 మంది విద్యార్థులకు గాయాలు


కరీంనగర్ జిల్లాలో టాటా ఏస్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. కోహెడ మండలం నాగసముద్రం శివారులో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో వ్యాన్ లో ప్రయాణిస్తున్న బస్వాపూర్ పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులు ఉపకార వేతనాల ఖాతా తెరిచేందుకు కోహెడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

  • Loading...

More Telugu News