: కోచింగ్ సెంటర్ పేరుతో లక్షల రూపాయలకు మోసం!
నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి కోచింగ్ సెంటర్ పేరుతో బీఈడీ, డైట్, ఎంసీఏ, ఎంబీఏ సీట్లు ఇప్పిస్తామని లక్షల రూపాయలు వసూలు చేసి ఉడాయించాడు. దాంతో, లబోదిబోమన్న బాధితులు వెంటనే సెంటర్ నిర్వాహకుడిపై స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అరవై మంది ఒక్కసారే కంప్లైంట్ ఇవ్వడంతో కేసు నమోదైంది. వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.