: కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది: నరేంద్ర మోడీ
బూటకపు హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. ఢిల్లీలో జరిగిన ర్యాలీలో నరేంద్ర మోడీ పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలకు ప్రజల పట్ల చిత్తశుద్ధి కరవైందన్నారు. ప్రజలు ప్రశ్నిస్తారనే కారణంతోనే ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ నాయకులు దూరంగా ఉంటున్నారని మోడీ ఎద్దేవా చేశారు.