: పది రోజుల్లో పదవి కోల్పోనున్న ముఖ్యమంత్రి: వివేక్


ముఖ్యమంత్రి కిరణ్ కు రోజులు దగ్గరపడ్డాయని, మరో పది, పదిహేను రోజుల్లో ఆయన పదవి ఊడిపోవడం ఖాయమని ఎంపీ వివేక్ జోస్యం చెప్పారు. సీఎం పచ్చి అవకాశవాదని విమర్శించారు. పదవి ఊడగానే కిరణ్ ను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఆదిలాబాద్ లో టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వివేక్ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పై వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News