: తూర్పు గోదావరి జిల్లా మీ సేవా కేంద్రాల్లో ఆధార్ నమోదు
కాకినాడ గాంధీనగర్ లోని మీ సేవా కేంద్రంలో ఆధార్ నమోదు సేవలను జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని మీ సేవా కేంద్రాల్లో ఆధార్ నమోదు చేపట్టనున్నారు. మొదటి దశలో 18 అర్బన్ కేంద్రాల్లో ఆధార్ సేవలను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 70 మీ సేవా కేంద్రాల్లో ఆధార్ నమోదుకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్ చెప్పారు. త్వరలోనే అన్ని మండల కేంద్రాల్లో మీ సేవ ద్వారా ఆధార్ నమోదు చేపడతామన్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన మీ సేవా కేంద్రాల్లో ఆధార్ నమోదును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.