: రాయల తెలంగాణ ప్రతిపాదనకు మేం వ్యతిరేకం: తెరాస నేత వినోద్


రాయల తెలంగాణ ప్రతిపాదనకు తెరాస వ్యతిరేకమని ఆ పార్టీ నేత వినోద్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మరింత సాగదీసేందుకే కేంద్రం ఈ ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చిందని ఆరోపించారు. ఈ రోజు ఆయన వరంగల్ లో మీడియాతో మాట్లాడారు. రాయల తెలంగాణ ప్రతిపాదనతో మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని... తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ ప్రతిపాదనపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీడబ్ల్యూసీ తీర్మానం చేసినట్టు పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలని వినోద్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News