: డిసెంబర్ 8న పులిచింతల ప్రాజెక్టు జాతికి అంకితం: మంత్రి పార్థసారధి
పులి చింతల ప్రాజెక్టును డిసెంబర్ 8వ తేదీన సీఎం కిరణ్ జాతికి అంకితం చేస్తారని మంత్రి పార్థసారధి ప్రకటించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంతో కృష్ణా డెల్టా రైతులకు మేలు జరుగుతుందన్నారు. నదీ జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు.
ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీని కంచికచర్ల లేదా గన్నవరం ప్రాంతానికి తరలించనున్నామని ఆయన చెప్పారు. విజయవాడలో రూ. 123 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి అనుమతి లభించిందని, ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి అనుమతులు వచ్చాయని మంత్రి చెప్పారు. డిసెంబర్ 8న ఆస్పత్రి శంకుస్థాపన జరపనున్నట్లు మంత్రి పార్థసారధి ప్రకటించారు.