: శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు: డిప్యూటీ సీఎం దామోదర
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వస్తుందని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈ రోజు కేంద్ర మంత్రి జైరాం రమేష్ ను కలసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భద్రాచలం, పోలవరం, వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ తదితర అంశాలపై తాము చర్చించామని రాజనర్సింహ వెల్లడించారు. రాయల తెలంగాణపై చర్చిస్తున్నామని జైరాం రమేష్ చెప్పినట్టు తెలిపారు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని జైరాం అన్నారని చెప్పారు.