: మహారాష్ట్ర సచివాలయంలో మళ్లీ అగ్నిప్రమాదం


మహారాష్ట్ర సచివాలయం 'మంత్రాలయ'లో మళ్లీ  అగ్ని ప్రమాదం సంభవించింది. సచివాలయం నాలుగో ఫ్లోర్లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె.కె. బాంతియా వెల్లడించారు.

కాగా, ప్రమాద సమాచారం అందుకున్నఅగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన సచివాలయానికి చేరుకున్నారు. కొద్దిసేపటికే మంటలను అదుపులోకి తేగలిగారు. మహారాష్ట్ర సచివాలయం గతేడాది కూడా అగ్ని ప్రమాదానికి గురైంది. అప్పుడు పెద్ద సంఖ్యలో కీలక ఫైళ్లు మంటలకు ఆహుతి అయ్యాయి. 

  • Loading...

More Telugu News