: ఢిల్లీలో ప్రధాని ర్యాలీ రద్దు.. నాలుగు సభల్లో మోడీ ప్రసంగం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ రోజు ఒక సభలో ప్రసంగించాల్సి ఉండగా అది రద్దయింది. బీజేపీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ మాత్రం నాలుగు సభల్లో ప్రసంగించనున్నారు. ఉదయం తూర్పు ఢిల్లీ, తర్వాత ఈశాన్య, దక్షిణ ఢిల్లీ, చాందినీ చౌక్ లో జరిగే సభల్లో మోడీ ప్రసంగిస్తారు. మోడీ ర్యాలీలను చూసే ప్రధాని తన ర్యాలీ రద్దు చేసుకున్నారని బీజేపీ ఆరోపించగా.. కాంగ్రెస్ వాటిని కొట్టిపడేసింది.