: విశాఖ తీరంలో నౌకాదళ విన్యాసాలు
డిసెంబర్ 4వ తేదీన ’నేవీ డే‘ సందర్భంగా విశాఖ తీరంలో నౌకాదళ సిబ్బంది రీహార్సల్స్ నిర్వహించారు. ఈ రీహార్సల్స్ లో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, పారాచూట్ లతో చేసిన విన్యాసాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ విన్యాసాలను వీక్షించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో విశాఖ తీరానికి తరలివచ్చారు.