: ఆరుషి కథకు హాలీవుడ్ డైరెక్టర్ రూ.5 కోట్ల ఆఫర్
సంచలనం సృష్టించిన ఆరుషి హత్యోదంతంపై హాలీవుడ్ డైరక్టర్ ఒకరు సినిమా తీసేందుకు ఆసక్తి చూపుతున్నారు. లండన్ కు చెందిన డైరెక్టర్ క్లిప్ ఎఫ్ రన్ యార్డ్ ఉత్తరప్రదేశ్ లోని దస్నా జైలు అధికారులను కలిశారు. ఆరుషి కథపై సినిమా తీసేందుకు వీలుగా ఆమె తల్లిదండ్రులు రాజేష్ తల్వార్, నుపుర్ తల్వార్ అనుమతి తీసుకునేందుకే ఆయన వచ్చినట్లు జైలు అధికారులు తెలిపారు. అయితే, నిబంధనల మేరకు రెండు వారాల తర్వాతే ఖైదీలను కలుసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు ఆ దర్శకుడికి తెలియజేశారు. అయితే, ఆరుషి తల్లిదండ్రులు ఒప్పుకుంటే రూ.5 కోట్లను చెల్లించేందుకు ఆ డైరెక్టర్ ఆసక్తిగా ఉన్నారట. ఆరుషి, హేమరాజ్ జంట హత్యల కేసులో రాజేష్ తల్వార్ దంపతులను దోషులుగా నిర్ధారిస్తూ కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే.