: అవినీతి ఉంటే పరిశ్రమలు ఎలా వస్తాయి.. ?: నారా లోకేశ్


రాష్ట్రంలో ప్రస్తుతం అవినీతి తాండవిస్తుంటే కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయని నారా లోకేశ్ అన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన నేడు గుడిపల్లె మండలం శెట్టి పల్లిలో 'పల్లె పల్లెకు తెలుగుదేశం' ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా లోకేశ్ పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. వారితో మాట్లాడుతూ, నూతన పరిశ్రమలు ఏర్పాటు కాకపోవడంతో యువతలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకుని పబ్బం గడుపుకొంటున్నారని విమర్శించారు. 

  • Loading...

More Telugu News