: 34 మందితో బయలుదేరిన విమానం అదృశ్యం
మొజాంబిక్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం అదృశ్యమైంది. విమానం మొజాంబిక్ నుంచి అంగోలా వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం 3 గంటలకు ఈ విమానం మోపాటలో టేకాఫ్ అయింది. సాయంత్రం 6.40 గంటలకు అంగోలా రాజధాని లువాండ చేరుకోవాల్సి ఉంది. కానీ, ఇంతలోనే ఆ విమానం అదృశ్యమైంది. ఈ విమానంలో మొత్తం 28 ప్రయాణికులతో పాటు ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నారు. ఉత్తర నమీబియా ప్రాంతంలో చిట్టచివరి సారిగా పైలట్లతో మాట్లాడినట్టు అధికారులు తెలిపారు. రాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలను ఆపివేశామని, ఈ ఉదయం నుంచి గాలింపు తీవ్రతరం చేస్తామని అధికారులు తెలిపారు.