: హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు కాంబ్లీ ఏం కోరాడు?
హార్ట్ ఎటాక్ కు గురైన మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. నిన్న ఉదయం ముంబైలోని సియాన్ ప్రాంతంలో రద్దీగా ఉన్న రహదారిపై పజేరో కారును నడుపుకుంటూ వెళుతున్న సమయంలో కాంబ్లీ హార్ట్ ఎటాక్ కు గురైన విషయం తెలిసిందే. గుండెపోటు రావడంతో కాంబ్లీ ఒక్కసారిగా పానిక్ అయ్యాడు. 'ప్లీజ్ నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లండి. లేకుంటే చచ్చిపోతాను' అంటూ వేడుకున్నాడని ట్రాఫిక్ పోలీస్ అధికారి సుజాతా పాటిల్ తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు సకాలంలో స్పందించి 11 నిమిషాల్లో కాంబ్లీని ఆస్పత్రికి తరలించడం వల్లే ఆయనకు ప్రాణాపాయం తప్పింది.