: ఈ రెండు దేశాల మధ్య కంచె వేయడమేల?
ఇరుగు పొరుగు దేశాలుగా పరస్పర సుహృద్భావ సంబంధాలను కలిగి ఉన్నప్పుడు ఇక ఈ రెండు దేశాల మధ్య కంచె వేయడం ఎందుకు? అని సరిహద్దు పరిరక్షణను పర్యవేక్షించే ఎస్‌ఎస్‌బి చీఫ్ అంటున్నారు. భారత్ నేపాల్ దేశాల మధ్య సరిహద్దు రేఖ వెంబడి కంచె ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనల్ని ఆయన కొట్టి పారేస్తున్నారు.
నిజానికి భారత్, నేపాల్ దేశాల మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య రాకపోకలకు ప్రజలకు పాస్‌పోర్టు అవసరం కూడా ఉండదు. భారతీయ పౌరసత్వాన్ని నిరూపించే ఆధారాలు ఉంటే చాలు.. ఇక నేపాల్‌లో యథేచ్ఛగా సంచరించవచ్చు. అలా.. ఇక్కడ ఎలాంటి ఆంక్షలు లేవు గనుక.. ఇక ప్రత్యేకంగా దేశాల మధ్య కంచె వేయడం ఎందుకు? అని అరుణ్ చౌధురీ అంటున్నారు.
ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు రేఖ వెంబడి సహస్త్ర సీమ బాల్ (ఎస్‌ఎస్‌బీ) పర్యవేక్షిస్తుంటుంది. చౌధురి ఈ సంస్థకు డైరక్టర్ జనరల్. నేపాల్ వైపు నుంచి మన దేశానికి పొంచి ఉన్న ముప్పు ఏమీ లేదని.. అందువల్ల కంచెలాంటి ఆలోచనలు చేయడం అనవసరం అని ఆయన పేర్కొంటున్నారు.
నిజానికి నేపాల్ ఒక హిందూ దేశంగా బాగా గుర్తింపు పొందింది. భారత్‌తో మంచి సంబంధాలను కలిగి ఉంది. ఈ రెండు దేశాల మధ్య ప్రజల రాకపోకలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవు. అయితే తాజాగా.. సరిహద్దుల మీద ఆంక్షలు కూడా పట్టించుకోకపోవడం అనేది.. కొత్త పరిణామం.