: మీరేసే ముష్టి మాకు అక్కర్లేదు: అసోం సీఎం


అసోంలో కోట్లకు కోట్లు ఆర్జించే టీ కంపెనీలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం కేవలం రూ. 15.23 కోట్లు మాత్రమే ఇచ్చాయి. దీంతో అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కి ఎక్కడ లేని కోపం వచ్చింది. 'మీరు పారేసే ముష్టి నాకు అక్కర్లే'దంటూ ఆ సొమ్మును తిప్పి పంపించేశారు. అసోంలో ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలు అనుభవిస్తూ, కోట్లలో లాభాలార్జిస్తూ టీ వ్యాపారం చేసే 25 కంపెనీలు ప్రజాభివృద్ధికి సహకరించడం లేదని సీఎంవో ప్రకటించింది. అంతే కాకుండా ఆ చెక్కులను తిప్పి పంపేస్తున్నట్టు తెలిపింది. టీ కంపెనీలు ఇచ్చిన విరాళాల్లో అత్యల్ప విరాళం 6,675 కాగా, అత్యధికం 3,88,700 రూపాయలు.

  • Loading...

More Telugu News